చిట్టి కథ

ఎక్కడ ఉంటావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు.. నీకన్నా ముందు , నీ మంచితనం పరిచయమైంది. కనీసం నీ పేరు కూడా తెలీదు, అయినా ప్రేమించేసాను. నన్ను కాపాడి నువ్వు మాయం అయ్యావు, కాని నీ స్పర్శ నన్ను వదలడం లేదు. నువ్వు ఎలా వుంటావో తెలుసుకోవాలని ఉంది, ఈ క్షణమే నిన్ను చూడాలని ఉంది. నా మనసు నీ కోసం పరుగులు తీస్తోంది. నా ఆలోచనలు అన్నీ నీ వైపే. ఎక్కడ ఉన్న నా ఎదురుగా వస్తావా? నిన్ను కలవాలని నా మనసు ఎంత ఆరాటపడుతోందో , నిన్ను ఎక్కడ miss అవుతానేమోనని అంతే భయం వేస్తోంది.

అయినా నా ప్రేమ స్వచ్చమైంది, ఏ స్వార్థం లేదు నా ప్రేమకి . అటువంటి నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నిన్ను కచ్చితంగా చూస్తాను.

అలా నిన్ను చూసిన రోజు , నిన్న చూసిన క్షణం నా జీవితంలో ఓ అద్బుతమైన క్షణం అవుతుంది. ఆ క్షణం తొందరగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.