నిన్ను కలిసిన మొదటి రోజు నాకు తెలీదు,

చివరి వరకు నా పక్కన నిలబడే మనిషివి నువ్వే అవుతావని.

మొదటగా నీతో మాట్లాడినపుడు నాకు తెలీదు,

నా మనసులోని మాటలను పంచుకునే వ్యక్తివి నువ్వే అవుతావని.

నిన్ను దూరం పెట్టినప్పుడు నాకు తెలీదు,

ఎప్పటికి నాతో ఉండె నా ప్రాణం నువ్వే అవుతావని.

ఎం చేసావో తెలీదు కాని,

నువ్వు లేకుండా బ్రతకలేనని మాత్రం తేలుస్తోంది.

ఒకటి మాత్రం కచ్చితంగ చెప్పగలను,

నా ప్రాణం పోయే చివరి నిమిషం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా…