చిన్ని గూటిలో ఒదిగున్న చిన్ని పిచ్చుక
ప్రపంచాన్ని చుట్టి రమ్మని పంపితే,
దారి మద్యలో అలసిన ఆ పిచ్చుక
ముందుకు సాగడానికి బయపడితే,
గమ్యం చేరుతుందా? రంగుల ప్రపంచం చూస్తుందా…?
అదే కాస్త కష్టపడి ఒక్క అడుగు ముందుకు వేస్తే
తీరం చేరుతుందేమో! కొత్త ప్రపంచం చూస్తుందేమో!