జీవితం అనే నటనలో, ఎంతో జాగ్రతగా ఆరి తేరి…
అరంగేట్రం చెయ్యడానికి కాలు బయటపెడితే …
అక్కడ నేర్చుకుంది,ఇక్కడ మనకోసం ఎదురుచూసేది,
రెండు వేరు అని తెలిసిన ఆ క్షణం…
బిక్కు బిక్కు మని కొట్టుకుంటున్న నీ గుండె చప్పుడు,
నీ చెవులకు స్పష్టంగా వినిపిస్తున్నప్పుడు…,
బిక్క మోహం వేసుకొని నిలబడ్డ నీ మనసుకు చెప్పు,
నీ గమ్యం ఎంతో దూరంలో లేదని…
ఆ గమ్యం చెరుకోవడానికే, ఈ అడ్డంకులు దారి పరుస్తోందని,
తలెత్తి దైర్యంగా ముందుకు సాగినప్పుడే,
నీ గమ్యం నీకు చేరువవుతుందని.