నిన్ను చూసిన మొదటి క్షణం అనిపించే,
ఈ ప్రపంచం ఆగిపోయిందేమో అని…
నీ చిరునవ్వు వికసించిన క్షణం అనిపించే,
ఓ కొత్త ప్రపంచం నా కళ్ల ముందు కదిలిందేమో అని…
నీ అందమైన పలుకులు విన్న క్షణం అనిపించే,
ఆ కొత్త ప్రపంచం రంగులతో నిండిందేమో అని…
నీ స్వచ్ఛమైన మనసును చూసిన క్షణం అనిపించే,
ఆ రంగుల ప్రపంచం లో త్వరగా అడుగు పెట్టాలి అని.