ఏమైన రాయాలి అని ఉంది,

కాని ఏమి రాయలో తెలీదు.

మనసులో ఉన్నది చెప్పాలి అని ఉంది,

కానీ ఎలా చెప్పాలో తెలీదు.

మదిలో మెదిలే ఎన్నో భావాలకు ప్రాణం పోయాలని అని ఉంది,

కానీ వాటికి ఏ విదంగా రూపం ఇవ్వాలో తెలీదు.

నాకు అన్నీ తెలుసు అనుకునే మన బ్రతుకులో,

మన సొంత ఆలోచనలే కొన్ని సార్లు మన ఆధీనంలో ఉండవు.

నాకు అన్నీ వచ్చు అనుకునే మన జీవితపయనంలో,

నేర్చుకోవడానికీ సిద్దంగా ఉన్న అంశాలు ఎన్నో ఎన్నెన్నో…!