కళ్లల్లో దాగిన కన్నీళ్లు,
అక్కడే ఆగనంటోంది.
బరించలేనంతగా బాధ పెరిగిపోతుంటే,
అవి చక్కిల్లు మీదుగా జారిపోతున్నాయి.
మనసు ఎందుకో భారంగా ఉంది,
కానీ కారణం తెలీదు.
మది నన్ను వదిలి వెళ్ళిపోయింది,
అదీ ఎందుకో తెలీదు.
నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను అని అన్నా,
నాకు నువ్వు ఒక్క అవకాశం ఇవ్వట్లేదు.
నువ్వు మాట్లాడే ఒక్క మాట కోసం,
ఎంతలా ఎదురుచూస్తున్నానో నీకు కూడా తెలుసు.
ఒక్క అవకాశం ఇవ్వలేవా,
నీ పరిస్థతిని నీతో కలిసి ఎదురుకొని, జీవితాంతం నీతో కలిసి బ్రతకడానికి.