ఒంటరిగా ఉంటె ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది.
ఒక చిన్న చిరునవ్వు నవ్వి,
నలుగురితో కలవడానికి ప్రయత్నించు.
ఆ క్షణం కాకపోవచ్చు, కాని సమయం గడిచేకొద్ది,
నీలోని ఒంటరితనం కనుమరుగవుతుంది.
అందుకు నీకు కావాల్సిందల్లా నీ ఆత్మవిశ్వాసం,
నీ పెదాలపై చిరునవ్వు పూయించడానికి
అవసరమయ్యె చిన్ని ధైర్యం.
నిన్ను నువ్వు ప్రేమించినప్పుడు,
నిన్ను నువ్వు నమ్మినప్పుడు,
ఆ చిన్ని ధైర్యం నీ కోసం నీలోనుండి వస్తుంది.