కలుస్తామని ముందుగా తెలీదు.

ఎప్పుడు దగ్గరయ్యామో కూడా తెలీదు.

కానీ కళ్ళు మూసి తెరిచేలోగా,

ఒకరి నవ్వులకు ఒకరు కారణం అయ్యాము.

ఒకరి దగ్గర నుండి ఏదైనా తీసుకునేంత చనువుంది.

ఒకరితో ఏమైనా చెప్పేంత సన్నిహితం ఉంది.

ఒకరికోసం ఏదైనా ఇచ్చేంత ప్రేమ ఉంది.

పొరపాటున ఒక చిన్న తప్పు చేసినా,

క్షమించి సరిదిద్దుతారు అనే ధైర్యం ఉంది.

సంతోషమైన – బాధైనా,కష్టమైన – సుఖమైనా,మంచైనా – చెడైనా,

మనల్ని వదలరు అనే భరోసా ఉంది.