ఇష్టంగా కలిసాం,
కష్టంగా విడిపోయాం.
ఇప్పుడు ఎదురుపడితే, ఎం మాట్లాడాలో తెలీదు.
వాళ్ళు మన నుండి ఎం వినాలనుకుంటున్నారో తెలీదు.
ఏమి మాట్లాడితే, ఏమి అనుకుంటారో తెలీదు.
ఒకప్పుడు నిమిషం కూడా కుదురుగా ఉండని పలుకులు,
ఇప్పుడు ఒక మాట మాట్లాడటానికి ఎందుకు తడబడుతున్నాయో తెలీదు.
ఒకప్పుడు క్షణం పక్కకి తిప్పని చూపులు,
ఇప్పుడు వాళ్ళని చూడడానికి ఎందుకు బయపడుతున్నయో తెలీదు.