పెదవి చివరనే ముడుచుకుపోయిన చిరునవ్వు పువ్వులు,

కళ్ల లోతుల్లోనే ఆగిపోయిన దుఃఖపు ఛాయలు,

దగ్గరని కూడా ధూరంగా మారుస్తున్న మనస్పర్థలు,

వివరించినా ఉపయోగం లేని రుజువులు.

వినాలి అనే ఉద్దేశం లేనప్పుడు,

ఓపికను కూడబెట్టుకొని ఎందుకు నిరూపించాలి?

అర్థం చేసుకునే ఆలోచన లేనప్పుడు,

ఆశలు పెంచుకొని ఎందుకు వేచి చుడాలి?