కళ్లతో తెలుపాల్సిన ఎన్నో భావాలు,

కళ్ల లోతుల్లో కూడా కనిపించనివ్వట్లేదు అతను.

బయటకి చెప్పాల్సిన ఎన్నో మదిలోని మాటలు,

మది అంచుల్లోకి కూడా రానివ్వట్లేదు ఆమె.

అపార్థాల మద్య నలుగుతు, తీరం మరచి చీకటిలో ఒంటరిగా నిల్చున్న ప్రేమ.

గమ్యం చేరడానికి ఇద్దరిలో ఒకరైన తమతో వెలుగులోకి తీసుకెళ్తారేమో అని చిన్న ఆశ .

పాపం దానికి ఎం తెలుసు,

వాళ్ళు ప్రేమని మరచి, అహాన్ని వడిలో చేర్చుకొని చెరో దారిన వెళుతున్నారని…