కలం పట్టి,

పుస్తకం ఎత్తి,

ప్రేరణ లేక,

మద్యలో ఆగి,

దిక్కులు చూస్తు,

నిల్చున్న నేను.

కళ్లలో తేజస్సు,

నడకలో రాజరికం,

నవ్వులో ఇంద్రజాలం,

చేతల్లో దైవగుణం,

గిటార్ వాయిస్తూ,

నాకు ఎదురైన నువ్వు.

కలం తిప్పుతూ,

పుస్తకం నిండి,

గ్రంథం రచించేంత,

విషయాలు నా ముందుంచావు.

కృతజ్ఞతతో నేను,

నేనెవరో కూడా తెలియని నువ్వు.