యువ రాణిలా పెరిగిన తను,
ఒక రాణిలా తనను తాను మార్చుకుంది.
సొంత కాళ్ళ మీద నిలబడ్డ తన మనసు,
మహారాణి ల చూసుకునే వాడినే కోరుకుంటుంది.
ఇక్కడ మహరాణిలా చూసుకోవడం అంటే …
తనకు సేవలు చేయడం కాదు,
తనకు, తన ఆలోచనా నిర్ణయాలకు గౌరవమివ్వడం.
తనకోసం యుధాలు చేయడమే కాదు,
తను చేసే యుధం లో కూడా తోడుండడం.
తన కోసం పూల బాట వేయ్యడం కాదు,
ముళ్ల బాటలో కూడా తనని వదలకపోవడం
తనని 365 రోజులు నవ్వించడమే కాదు,
తన కన్నీరు తుడిచే చేయి నీదే అవడం.
తన సంతోషాల్లో పక్కనుండడమే కాదు,
తన బాధ లో కూడా నీ ఉనికి తన చుట్టే ఉండడం