మనసులో ఏదో బాధ, బయటికి రానంటోంది… ఎలా చెప్పాలో తెలీదు , ఎవరితో పంచుకోవాలో తెలీదు… చెప్పుకున్నా, వినేవాళ్ళు లేరు… కాదు అర్థం చేసుకునేవాళ్ళు లేరు…
ఒంటరిదాన్ని అనిపిస్తోంది. చుట్టు అందరు ఉన్నా, ఒక ఆపద్ధపు నవ్వు పూసుకొని అందరిలో ఒకరిగా ఉన్నా . కానీ మనకంటూ ఒకరు ఉన్నారు అనే భావన, ఎక్కడా కనిపించట్లేదు.
జీవితం చాలా విచిత్రమైంది. ఒకరు దగ్గరవుతుంటే ఇంకొకరిని దూరం చేస్తుంది. రవ్వంత ఆనందాన్ని ఇచ్చి, కొండంత బాదని కూడా ఇస్తుంది. కొన్ని బాధలు అందరితో పంచుకోగలం, మరి కొన్ని బాధలు కొందరితో పంచుకోగలం. కాని కొన్ని బాధలు మాత్రమే ఎవరితోను పంచుకోలేము. ఒంటరిగానే భరించాలి. అవి ఎప్పటికి మనసు లోతుల్లో మిగిలిపోతుంది…