నీతో నువ్వు కాస్త సమయం గడుపు,
నీ గురించి నీకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
అవి తెలుసుకోవడానికీ ప్రయత్నించు.
కొత్తవి నేర్చుకో, రానివి సాధించు,
నిన్ను నువ్వు మెరుగు పరుచుకో.
ఒకరి కోసం నువ్వు వాళ్ళ వెనుక పరిగెత్తుకుండా,
నీ అవసరముందని వాళ్ళే నీ వెనుక పరిగెత్తేలా మారు.
ప్రయత్నించు, ఓడిపోయిన పరువాలేదు…
మళ్ళీ ప్రయత్నించు.
చేసిన తప్పు మళ్ళీ చెయ్యకుండా,
నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ ప్రయత్నించు.
ఎన్ని సార్లు అని ఓడిపోతావు,
ఎదో ఒకచోట ఆ ఓటమి ఒడిపోవాల్సిందే,
విజయం నీ సొంతమవ్వాల్సిందే.